![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1116లో.. రాజు ఇచ్చిన టైమ్ ముగియడంతో తన దగ్గరికి వెళ్ళి రేఖను నిలదీస్తాడు. పిన్ని.. నువ్వు నిజం చెప్పకపోతే నేనే అందరి ముందు చెప్పేస్తానని రాజు అంటాడు. కానీ రేఖ మాత్రం.. నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. సాక్ష్యం కావాలి కదా.. ఆ సాక్ష్యాన్నే లేపేశాను. ఇక నువ్వు నన్నేం చేయలేవంటూ రేఖ ధైర్యంగా మాట్లాడుతుంది. లక్కీ తన కోసం ఎంత ఆరాటపడుతున్నాడో గుర్తుచేసినా.. పుట్టినప్పుడే వాడిని వద్దనుకున్నా.. ఇప్పుడు కొడుకుగా అంగీకరిస్తానా అంటూ రేఖ నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోతుంది. అయితే ఆమె జుట్టు నుంచి పడిన వెంట్రుకను చూసిన రాజు మాత్రం కొత్త ప్లాన్ వేస్తాడు.
మరోవైపు రాజును ఇంప్రెస్ చేయడానికి ఇందు కాఫీపై లవ్ సింబల్ పెట్టాలని ప్రయత్నిస్తుంది. కాపురంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ప్రేమను చూపించాలి.. అప్పుడే బంధం ఎప్పుడూ కొత్తగా ఉంటుందని స్వాతికి చెప్తుంది. తర్వాత నిద్రపోతున్న రాజును చూసి మురిసిపోయి.. నువ్వు ఈ ఇంటి వారసుడివి.. నువ్వు నాకే సొంతం అవ్వాలంటూ బుగ్గపై ముద్దు పెడుతుంది. కానీ రాజు లేచిన తర్వాత కాఫీలోని లవ్ సింబల్ కూడా చూడకుండా తాగేయడంతో ఇందు కోప్పడుతుంది. హాల్లోకి వెళ్లిన రాజు బుగ్గపై ఉన్న కిస్ మార్క్ చూసి అందరు తనని ఆటపట్టించడంతో రాజు చూసుకొని ఇది ఎవరు పెట్టారంటూ షాక్ అవుతాడు. చివరకు ఇందు మాత్రం.. కలలో పెట్టిన ముద్దు బయటికి డ్రీమోపతిలా వచ్చిందంటూ రాజును ఆటపట్టిస్తుంది.
ఇక రాజు, ఇందుల సరదా చూసి ఐశ్వర్య అసూయతో రగిలిపోతుంది. నన్ను అందరూ అడ్డుకుంటూ వేధిస్తున్నారు.. మీరు మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తున్నారా.. మీ సంగతి చూస్తానని ఐశ్చర్య మనసులో అనుకుంటుంది. అంతలో రాజు పేరుతో వచ్చిన కొరియర్‌ను అపర్ణ అతనికి ఇస్తుంది. అది చూసిన ఇందు ఏమిటని అడగగా, రాజు అసలు విషయం చెప్తాడు. రేఖ ఆంటీ నా దగ్గర వెంట్రుక విసిరి వెళ్లింది కదా.. అదే నాకు కావాల్సిన సాక్ష్యం. ఆ వెంట్రుకతో డీఎన్ఏ టెస్ట్ చేయించా. ఇక నిజం బయటపడుతుందని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |